WELCOME TO కలవలపల్లి

కలవలపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, చాగల్లు మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నది. ఈ ఊరికి వెళ్ళాలంటే నిడదవోలు నుంచి బ్రాహ్మణగూడెం మీదుగా 8 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గాన ప్రయాణించాలి లేదా చాగల్లు నుంచి ఊనగట్ల మీదుగా 7 కిలోమీటర్లు పోవాలి. ఇక్కడి నేల సుమారు 70% గరప నేల (ఎర్ర నేల). అందుచేత ఇక్కడ ఎక్కువగా జీడిమామిడి, కొబ్బరి, మామిడి మరియు పామాయిల్ పండిస్తారు. మిగిలిన 30% నల్లరేగడి నేల కాబట్టి అంతమేర వరి , చెరకు వగైరా పండిస్తారు . వ్యవసాయం మొత్తంలో 80% బోర్ల మీదే అధారపడి ఉన్నది.

రవాణా సౌకర్యాలు

ఈ గ్రామానికి బస్ షెల్టర్ ఉన్నది. ఈగ్రామం ప్రధాన రహదారికి దూరంగా ఉండటం వల్ల రవాణా సౌకర్యం పెద్దగా మెరుగు పడలేదు . దగ్గర పట్టణం నిడదవోలు నుంచి మాత్రమే 2,3 నామ మాత్రపు బస్ సర్వీస్ లు నడుస్తున్నాయి . దీనికి దగ్గరి రైల్వే స్టేషన్ బ్రాహ్మణగూడెం రైల్వే స్టేషన్. ప్రయాణం ఎక్కువగా వ్యక్తి గత వాహనాలు, ప్రైవేటు ఆటోల ద్వారా సాగుతుంది

నీటి సౌకర్యాలు

త్రాగే నీరు కోసం 3 రక్షిత మంచినీటి టాంకులు ఉన్నాయి. ఈ ఊరి లో 4 చెరువులు కూడా వున్నాయి.

  1. ఊర చెరువు (ఇది ఊరు అందరకూ ఊపయోగపడే చెరువు)

  2. మాల చెరువు( వర్ణ వివక్ష కొనసాగే రోజులలో దళితుల కోసం ఉండేది . ఇపుడు అందరూ అన్ని చెరువులూ ఉపయోగించుకుంటున్నారు)

  3. చాకలి చెరువు( బట్టలు ఉతికేందుకు వాడుతున్న చెరువు)

  4. నాపచెరువు( ఇది వ్యవసాయం కోసమే ఉపయోగపడుతున్నది. బ్రాహ్మణగూడెం మరియు కలవలపల్లి మధ్యలో ఉంటుంది)